Kritishetty: బేబమ్మ ప్లాస్టిక్ సర్జరీ.. ఇదే క్లారిటీ!
బేబమ్మ కృతి శెట్టి మారిపోయిందా? అంటే ఔననే అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు. కృతి అంతకు ముందులా లేదు.. చాలా గ్లామర్‌గా కనిపిస్తోంది.. అమ్మడి ఫేస్‌లో చాలా మార్పులు వచ్చాయి.. కృతి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో బేబమ్మకు మండిపోయింది. మరి కృతి ఏం చెబుతోంది.
కృతిశెట్టి ఈ పేరు వింటే కుర్రాళ్లకు కునుకు పట్టదు. ఉప్పెన సినిమాతో కృతికి ఫిదా అయిపోయారు తెలుగు కుర్రకారు. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో కృతి కెరీర్ పీక్స్‌కు వెళ్లిపోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు కృతి కొంప ముంచేశాయి. ది వారియర్, మాచర్ల నియోజక వర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక రీసెంట్గా వచ్చిన కస్టడీ సినిమా కూడా కృతిని కాపాడలేకపోయింది. దీంతో కృతిశెట్టి డౌన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయిపోయింది. మరోవైపు శ్రీలీల దూసుకుపోతోంది. దాంతో కృతి శెట్టికి ఇక ఆఫర్లు రావడం కష్టమే అంటున్నారు.
ఇలాంటి సమయంలోనే కృతి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే వార్తలు వైరల్‌గా మారాయి. నిన్నటి వరకు ఒక లుక్‌లో కనిపించిన కృతి ఇప్పుడు మరింత అందాంగా తయారయ్యింది. దాంతో ఈ మధ్య కృతి ఫేస్‌లో కాస్త మార్పులు కనిపిస్తున్నాయని, ఆమె సర్జరీ చేయించుకుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇలాంటి వార్తలపై కృతి రియాక్ట్ అయింది. అలాంటిదేమి లేదని తేల్చి చెప్పింది. మేకప్, హెయిర్ స్టైల్ వల్ల కొత్తగా కనిపిస్తున్నా.. కానీ ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని చెప్పింది బేబమ్మ. ‘అసలు ఇలాంటివి ఎవరు రాస్తారో, ఎందుకు రాస్తారో అర్థం కావడం లేదు. మాకు కూడా ఫ్యామిలీస్, ఎమోషన్స్ ఉంటాయి. ఇలాంటి రూమర్స్ విన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఉప్పెనలో ఉన్నట్లు ఇప్పుడు లేను అంటున్నారు. అయినా ఎప్పుడూ ఒకేలా ఉండలేము కదా. మేకప్, హెయిర్ స్టైల్ వల్ల కూడా మార్పులు కనిపిస్తాయి. అంతమాత్రానా ప్లాస్టిక్ సర్జరీ అంటారా’ అంటూ కృతి శెట్టి అసహనం వ్యక్తం చేసింది. దీంతో కృతి శెట్టి సర్జరీ చేయించుకోలేదనే క్లారిటీ వచ్చేసింది.