డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విషయంలో తరచూగా వార్తల్లో నిలుస్తునే ఉన్నాడు బండ్ల గణేష్. ఆ మధ్య పూరి కొడుకు ఆకాష్ పూరి నటించిన ‘చోర్ బజార్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. పూరిపై విరుచుకుపడ్డాడు బండ్ల గణేష్. నేనైతే కన్న కొడుకు కోసం ఎక్కడున్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చేవాడినని.. కానీ పూరి తన కొడుకు కోసం రాలేకపోవడం బాధాకరమని.. పూరిని గట్టిగానే అరుసుకున్నాడు బండ్ల గణేష్. దాంతో బండ్ల స్పీచ్ సెన్సేషనల్‌గా మారింది.
అయితే దీనిపై డైరెక్ట్‌గా పూరి స్పందించకపోయినా.. తన మ్యూజింగ్స్ ద్వారా కౌంటర్ ఇచ్చాడు. నాలుకను అదుపులో పెట్టుకోవాలని.. మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా.. క్లోజ్ ఫ్రెండ్స్ అయినా.. ఆఫీస్‌లోనైనా.. ఆఖరికి కట్టుకున్న పెళ్ళాం ముందు కూడా ఆచితూచి మాట్లాడండి. చీప్‌గా వాగొద్దు, చీప్‌గా బిహేవ్ చేయవద్దని.. చెప్పుకొచ్చాడు. దాంతో పేరు ప్రస్తావించకపోయినా.. ఇది బండ్లను ఉద్దేశించే అన్నాడనే చర్చ జరిగింది. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో బండ్ల వర్సెస్ పూరిగా మారిపోయింది. అయితే ఇప్పుడు మరోసారి పూరి గురించి సంచలన కామెంట్స్ చేశాడు బండ్ల. రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరిపై సీరియస్ అయ్యాడు బండ్ల. ‘నాలుక జాగ్రత్తగా పెట్టుకో.. అని పూరి ఎందుకు స్పందించారని.. సదరు యాంకర్ ప్రశ్నించగా.. ‘అసలు భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు మనిషేనా.. అని అన్నాడు బండ్ల గణేష్. అది ఆయన ఇష్టం.. అని యాంకర్ అనగా.. ‘పూరికి మంచి, చెడు చెప్పే రైట్స్ నాకున్నాయి. అతను నా ఫ్రెండ్.. అంటూ సీరియస్ అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతోంది. ఇదే కాదు మిగతా విషయాల్లోను మండిపడ్డాడు బండ్ల. ఏదేమైనా బండ్ల కామెంట్స్ వైరల్‌గా మారాయి.