దర్శకుడిగా ఎలాంటి అనుభవం లేదు. అప్పటి వరకు కేవలం కామెడీ పాత్రలు మాత్రమే చేసేవాడు. అలాంటి వేణు(venu) సడెన్ గా డైరెక్టర్ గా మారాడు. చిన్న సినిమానే కదా అని ఎవరూ పట్టించుకోలేదు. కానీ మూవీ చూసిన తర్వాత అందరూ నోరెళ్ల పెట్టారు. ఎలాంటి అనుభవం లేకుండానే ఇంత బ్రహ్మాండంగా ఒక చిన్న పాయింట్ తో ఇంత బాగా సినిమా చేయవచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు వేణు.
బలగం(Balagam) మూవీ హిట్ చాలా చిన్న సినిమాలకు ఊపిరినిచ్చింది. కాగా దర్శకుడు వేణుకు ఈ మూవీ తర్వాత చాలా ఆఫర్లు వస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. కాగా వేణు(venu tillu) మాత్రం ప్రస్తుతం తన హిట్ ని ఆస్వాదిస్తున్నాడు. విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. బలగం రిలీజైన నెల రోజుల పాటు ప్రమోషన్స్ తో హైదరాబాద్ లోనే గడిపేసిన వేణు ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వగానే హాలిడే మూడ్ లోకి వెళ్ళిపోయి వెకేషన్ ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే తన మిత్రులతో రెండు మూడు వెకేషన్స్ చూట్టేసిన వేణు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ల్లాస్ సిటీలో ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
దిల్ రాజు ప్రొడక్షన్స్ లో మొదటి సినిమా చేసిన వేణు ఇప్పుడు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ లో భారీ బడ్జెట్ తో రెండో సినిమా చేయబోతున్నాడు. ‘బలగం’ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో దిల్ రాజు(dil raju) వేణుకి భారీ బడ్జెట్ తో పాటు కథకి సూటయ్యే కాస్ట్, టాలెంటెడ్ క్రూని ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే ఓ పాయింట్ చెప్పి దిల్ రాజు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. ఓ వైపు విదేశాల్లో ఎంజాయ్ చేస్తూనే, మరో వైపు స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.