ANIMAL Movie: అర్జున్ రెడ్డి డైరెక్టర్ ‘యానిమల్’ కథ లీక్!
విజయ్ దేవరకొండతో 'అర్జున్ రెడ్డి' సినిమా తీసి.. సెన్సేషన్ క్రియేట్ చేశాడు యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి వచ్చి ఐదారేళ్లు అవుతోంది. అయినా ఇప్పటికీ ఈ సినిమా ఓ సంచలనమే. ఈ సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశాడు సందీప్. అక్కడా కూడా ఈ సినిమా అదరగొట్టింది. ఇక ఇప్పుడు యానిమల్గా మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు సందీప్ రెడ్డి వంగ.. తాజాగా ఈ సినిమా కథ ఇదేనంటూ.. ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
ఒక్క ‘అర్జున్ రెడ్డి’ సినిమా(ArjunReddy Movie)తో టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లోకి వెళ్లిపోయాడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga). ఎంతలా అంటే.. యానిమల్ మూవీ(Animal Movie) రిలీజ్ అవకముందే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా అనౌన్స్ చేశాడు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తోను ఓ భారీ ప్రాజెక్ట్ ప్రకటించాడు. అయితే ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ‘యానిమల్’ సినిమాతో బిజీగా ఉన్నాడు సందీప్. ఇప్పటికే యానిమల్ గ్లింప్స్‌తో అసలు సిసలైన వైలెంట్ ఎలా ఉంటుందో చూపించబోతున్నట్టు చెప్పేశాడు సందీప్ రెడ్డి. దాంతో ఈ సినిమా పవర్ ఫుల్ యాక్షన్ మూవీ అనే క్లారిటీ వచ్చేసింది.
అయితే.. అసలు ఈ సినిమా కథేంటి? ఎలాంటి బ్యాక్ డ్రాప్లో ఉండబోతుంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇప్పుడో లీకేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియా టాక్ ప్రకారం.. యానిమల్ సినిమా తండ్రీకొడుకుల రిలేషన్ షిప్ నేపథ్యంలో ఉండబోతుందట. అర్జున్ రెడ్డిలో లవ్ స్టోరీతో అదరగొట్టిన సందీప్ రెడ్డి.. ఈసారి తండ్రి కొడుకుల బాండింగ్‌ను మరింత పవర్ ఫుల్‌గా చూపించబోతున్నాడట. యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటిస్తున్నాడు. బాబీ డియోల్ కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాడు.
దాంతో ఈ సినిమాలో.. పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రి కొడుకు మధ్య ఎమోషన్.. పీక్స్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇలాంటి సబ్జెక్ట్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై చూడని విధంగా యానిమల్ ఉంటుందట. దాంతో యానిమల్ పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాను.. ఆగష్టు 11న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి యానిమల్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.