రోషన్, ముస్తఫా అస్కరి, శ్రీనివాస్ ప్రభన్, అనిరుద్, పూజ, లయ, ఇందు, సాయి శ్రీ, శ్రీవల్లి, కీర్తన, సత్తిపండు, కోటేష్ మానవ నటిస్తున్న చిత్రం “అరంగేట్రం”. ఈ మూవీని మహి మీడియా వర్క్స్ బ్యానర్ నిర్మిస్తోంది. శ్రీనివాస్ ప్రభన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మహేశ్వరి కె.ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అరంగేట్రం మూవీ(Aramgetram Movie) మే 5న రిలీజ్ కానున్నట్లు చిత్ యూనిట్ ప్రకటించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగింది.
దర్శకుడు శ్రీనివాస్ ప్రభన్ మాట్లాడుతూ.. ‘అరంగేట్రం’ మూవీ పక్కా కమర్షియల్ మూవీ అన్నారు. ఈ మూవీ సైకో బేస్డ్ కాన్సెప్ట్‌తో సాగుతుందన్నారు. మంచి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్, మంచి లవ్ స్టోరి ఉంటుందని, పాటలు, ఫైట్స్, కామెడీ అన్నీ బాగా వచ్చాయన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గిడియాన్ కట్టా అద్భుతమైన సంగీతం అందించారన్నారు.
నిర్మాత మహేశ్వరి.కె మాట్లాడుతూ..‘అరంగేట్రం’ సినిమా చాలా బాగా వచ్చిందని, మే 5న థియేటర్స్‌లో విడుదల కానున్నట్లు తెలిపారు. సహ నిర్మాత విజయ లక్ష్మి మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ సినిమాను ఆదిరిస్తారనే నమ్మకంతో మే 5న ‘అరంగేట్రం’(Aramgetram Movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ గిడియన్ కట్టా మాట్లాడుతూ..గతంలో మంత్ర సినిమాకు కంపోజర్‌గా వర్క్ చేశానని, తన లైఫ్‌కు మంచి సక్సెస్‌ను ఈ మూవీ ఇస్తుందన్నారు. రోషన్ మాట్లాడుతూ..విరూపాక్ష సినిమాలోలాగానే ‘అరంగేట్రం’(Aramgetram Movie)లోనూ డిఫరెంట్ రోల్ చేశానని, మంచి రోల్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీనివాస్ కి, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.