NTR’s ‘ఆంధ్రావాలా’ రీ రిలీజ్!? ఇది నిజంగా షాకింగే..
NTR : హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తే ఏముంటుంది కిక్ అనుకున్నారో ఏమో.. ఓ డిజాస్టర్ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. సెకండ్ మూవీ 'స్టూడెంట్ నెంబర్ వన్'తో సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత 'ఆది' అదిరిపోయే హిట్ కొట్టాడు. ఇక సింహాద్రి సినిమాతో యంగ్ టైగర్ కెరీర్ పీక్స్‌కు వెళ్లిపోయింది.
హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తే ఏముంటుంది కిక్ అనుకున్నారో ఏమో.. ఓ డిజాస్టర్ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. సెకండ్ మూవీ ‘స్టూడెంట్ నెంబర్ వన్’తో సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత ‘ఆది’ అదిరిపోయే హిట్ కొట్టాడు. ఇక సింహాద్రి సినిమాతో యంగ్ టైగర్ కెరీర్ పీక్స్‌కు వెళ్లిపోయింది. అలాంటి మాసివ్ హిట్ తర్వాత.. ఎన్టీఆర్ నుంచి నెక్స్ట్ లెవల్ అనేలా ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అదే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆంధ్రావాలా. ఈ సినిమా ప్రకటించినప్పుడు అంచనాలు ఆకాశన్నంటాయి. ఎంతలా అంటే.. ఆడియో ఫంక్షన్లో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. అప్పట్లో ఆంద్రావాలా ఫంక్షన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ తీరా థియేటర్లోకి వచ్చాక.. ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. 2004లె విడుదలైన ఈ చిత్రం.. పూరి, ఎన్టీఆర్ కెరీర్లోనే అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. అలాంటి రికార్డ్ ఉన్న ఈ సినిమాను దాదాపు 19 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అంటే.. నిజంగా షాకింగ్ అనే చెప్పొచ్చు. ఇంకా అఫిషీయల్ కన్ఫర్మేషన్ లేకపోయినా.. ఇదే నెలలో ఆంధ్రావాలా మరోసారి థియటర్లలోకి రాబోతుందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సడెన్‌గా ఈ సినిమానే ఎందుకు రీ రిలీజ్ చేయబోతున్నారనేది అర్థం కాని విషయమే. దీని పై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో రీ రిలీజ్ హవా నడుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ‘జల్సా’, మహేష్ బాబు ‘పోకిరి’ సినిమాలు రికార్డులు కొల్లగొట్టాయి. కానీ ఫ్లాప్ మూవీ ఆంధ్రావాలా రీ రిలీజ్ చేయడం విశేషమనే చెప్పాలి.