హాట్ యాంకర్ అనసూయ గురించి అందిరికీ తెలిసిందే. ఇద్దరు పిల్లలకు తల్లైనా కూడా గ్లామర్ విషయంలో అనసూయ తగ్గేదేలే అంటోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోస్ షేర్ చేస్తూ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతునే ఉంటుంది. తాజాగా ఫారిన్ వీధుల్లో, పబ్లిక్ ప్లేసుల్లో పొట్టి నిక్కర్లో సందడి చేస్తోంది అనసూయ.
ప్రస్తుతం అనసూయ(Anasuya) తన భర్త భరద్వాజ్‌తో కలిసి బ్యాంకాక్ వెకేషన్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. ఫ్యామిలీ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తునే ఉంది. అక్కడి బ్యాంకాక్ వీధుల్లో పొట్టి నిక్కర్లో షికార్లు చేస్తోంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అవి కాస్త ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. రెడ్ టాప్, బ్లాక్ షార్ట్‌లో అనసూయ చాలా హాట్‌గా ఉంది. ఈ ఫోటోలపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడే కాదు.. గతంలోను అనసూయ బోల్డ్ ట్రీట్ ఇచ్చింది. ఇటీవల తన పెద్ద కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఏకంగా బికినీలో కనిపించి షాక్ ఇచ్చింది. ఈ ఫోటోలపై నెటిజన్స్ మండి పడ్డారు. ఒక్క ఫోటోలు మాత్రమే షేర్ చేస్తూ రచ్చ చేయడం అనసూయ.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ టార్గెట్‌గా చేసే ట్వీట్స్‌తో కాంట్రవర్శీ క్రియేట్ చేస్తునే ఉంటుంది. రౌడీ ఫ్యాన్స్‌కు, అనసూయ(Anasuya)కు అస్సలు పడదు. ఈమె ఏదైనా అంటే చాలు.. ఆంటీ అంటూ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తుంటారు.
అనసూయ(Anasuya) కావాలనే ఇలా అటెన్షన్ క్రియేట్ చేస్తుందని అంటుంటాయి సోషల్ మీడియా వర్గాలు. ఇకపోతే.. కేవలం బుల్లితెరపైనే కాదు.. సినిమాల పరంగా అనసూయ కెరీర్ పీక్స్‌లో ఉంది. అనసూయ లేటెస్ట్ మూవీ ‘విమానం’ మూవీ జూన్ 9న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో అమ్మడు వేశ్య పాత్రలో నటిస్తోంది. ఇక మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప 2లోను అనసూయ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఇందులో అమ్మడు సునీల్ భార్యగా దాక్షాయణి పాత్రలో నటిస్తోంది. వీటితో పాటు అనసూయ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. మొత్తంగా అనసూయ మాత్రం.. ప్రస్తుతం భర్తతో కలిసి బ్యాంకాక్ వీధుల్లో ఫుల్ చిల్ అవుతోంది.