మార్టిన్ కూడా పుష్ప పాటలతో స్టేజ్ ను ఉర్రూతలూగించాడు. ఈ ఈవెంట్ కు చాలామంది సినీ అభిమానులు హాజరయ్యారు. ఈసందర్భంగా అల్లు అర్జున్ ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఈసందర్భంగా ఈవెంట్ లో అల్లు అర్జున్
Allu Arjun : సోషల్ మీడియాలో ఊ అంటావా మావా పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ పాట సినిమాకు కూడా ఎంతో విజయాన్ని అందించింది. ఆ పాటకు సినీ అభిమానులు డ్యాన్స్ వేస్తే ఒక లెక్క. ఆ పాటలో చిందులేసిన వాళ్లే స్వయంగా మళ్లీ ప్రేక్షకుల ముందు చిందేయడం మరో లెక్క. తాజాగా అదే జరిగింది. సింగర్ మార్టిన్ గ్యారిక్స్ తాజాగా హైదరాబాద్ లో ఓ షో నిర్వహించాడు. దానికి స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు.
మార్టిన్ కూడా పుష్ప పాటలతో స్టేజ్ ను ఉర్రూతలూగించాడు. ఈ ఈవెంట్ కు చాలామంది సినీ అభిమానులు హాజరయ్యారు. ఈసందర్భంగా అల్లు అర్జున్ ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఈసందర్భంగా ఈవెంట్ లో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని పాటలను ప్రదర్శించారు. ఊ అంటావా అనే మాస్, ఐటెమ్ సాంగ్ రాగానే అందరూ ఒక్కసారిగా పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోయారు. అల్లు అర్జున్ కూడా స్టేజ్ ఎక్కి మార్టిన్ తో కలిసి స్టెప్పులేశారు. అల్లు అర్జున్ వేసిన కిర్రాక్ స్టెప్పులకు స్టేజ్ ఊగిపోయింది.
Allu Arjun : పుష్ప 2 సినిమా షూటింగ్ లో బన్నీ బిజీ
ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో నడుస్తోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చే సినిమాల్లో నటించనున్నారు. ఇక.. సింగర్ మార్టిన్ ఈవెంట్ లో బన్నీ వేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోను ఆ పాటలో నర్తించిన సమంత కూడా షేర్ చేసింది. ఆ పాట ఎవర్ గ్రీన్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. మార్టిన్ తో కలిసి ఈవెంట్ లో అల్లు అర్జున్ పాల్గొన్న ఫోటోలను బన్నీ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.