»Aishwarya Rajinikanth Jewellery Robbed From Rajinikanth Home
Rajinikanth :రజినీకాంత్ ఇంట్లో చోరీ..డైమండ్స్, గోల్డ్ మాయం
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ఇంట్లో భారీ చోరీ జరగడంతో పోలీసు కేసు(Police case) నమోదైంది. ఈ చోరీలో సుమారు రూ.3.60 లక్షల విలువైన డైమండ్స్(Diamonds), గోల్డ్(Gold)ను దుండగులు దొంగిలించారు. ఈ చోరీ గురించి రజినీకాంత్ కూతురు ఐశ్వర్య(Iswarya) చెన్నైలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐశ్వర్య రజినీకాంత్ తెలిపిన ఫిర్యాదు మేరకు..ఆమెకు చెందిన 60 సవర్ల విలువైన బంగారం, వజ్రాభరణాలను లాకర్లో భద్రపరిచింది.
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ఇంట్లో భారీ చోరీ జరగడంతో పోలీసు కేసు(Police case) నమోదైంది. ఈ చోరీలో సుమారు రూ.3.60 లక్షల విలువైన డైమండ్స్(Diamonds), గోల్డ్(Gold)ను దుండగులు దొంగిలించారు. ఈ చోరీ గురించి రజినీకాంత్ కూతురు ఐశ్వర్య(Aishwarya) చెన్నైలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐశ్వర్య రజినీకాంత్ తెలిపిన ఫిర్యాదు మేరకు..ఆమెకు చెందిన 60 సవర్ల విలువైన బంగారం, వజ్రాభరణాలను లాకర్లో భద్రపరిచింది. 2019లో జరిగిన తన సోదరి సౌందర్య వివాహానికి ఆ నగలను చివరిసారిగా ధరించినట్లు తెలిపింది.
ఆ వివాహం తర్వాత ఆ నగలను లాకర్లోనే ఉంచింది. 2021లో హీరో ధనుష్(Dhanush)తో విడాకులు అయ్యే వరకూ కూడా లాకర్లోనే ఆ నగలను భద్రపరిచింది. గత ఏడాది చివరిలో ఆ లాకర్ ను తన తండ్రి రజినీకాంత్(Rajinikanth) ఇంటికి మార్చినట్లు తెలిపింది. లాకర్ తాళాలు కూడా ఆమె ఫ్లాట్ లోనే ఉన్నట్లు తెలిపింది. అయితే లాకర్ లో ఆభరణాలున్నట్లు ఇంట్లో పనిచేసే కొంత మంది సిబ్బందికి తెలుసని ఐశ్వర్య(Aishwarya) ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇంట్లో పనిచేసే ఇద్దర్ని, ఒక డ్రైవర్ ను అనుమానితులుగా పేర్కొంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇకపోతే ఏడేళ్ల తర్వాత ఐశ్వర్య(Aishwarya) తన మూడో సినిమాను మొదలు పెట్టింది. ‘లాల్ సలాం’ అనే టైటిల్ తో ఆ సినిమా తెరకెక్కుతోంది. స్పోర్ట్స్ అండ్ రిలీజియన్ బ్యాక్ డ్రాప్ తో ఈ మూవీని రూపొందిస్తోంది. ఈ మూవీలో విష్ణు విశాల్(Vishnu Vishal) హీరోగా చేస్తుండగా రజినీకాంత్(Rajinikanth) గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.