కారు ప్రమాదం (Car Accident) తర్వాత తొలిసారిగా యువ నటుడు శర్వానంద్ (Sharwanand) బయటకు వచ్చాడు. తన పెళ్లి తేదీ (Marriage) గడువు సమీపిస్తుడడంతో ముఖ్యమైన వారికి పెళ్లి పత్రికలు (Wedding Cards) పంపిణీ చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తెలంగాణ రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ (Joginipally Santosh Kumar) కు పత్రిక ఇచ్చిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటో వైరల్ గా మారింది.
తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి (Madhusudhan Reddy) కుమార్తె రక్షితారెడ్డితో (Rakshitha Reddy) శర్వానంద్ వివాహం జూన్ 2, 3 తేదీల్లో జరుగనుంది. రాజస్థాన్ (Rajasthan)లోని జైపూర్ (Jaipur)లో ఉన్న లీలా ప్యాలెస్ (Leela Palace)లో జరిగే పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులను శర్వా ఆహ్వానిస్తున్నాడు. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తున్న సమయంలోనే ఇటీవల ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తాజాగా ఎంపీ సంతోశ్ కు పెళ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానించాడు.
ఈ సందర్భంగా ఎంపీని కలిసిన సమయంలో శర్వా లుక్స్ (Looks) ఆకట్టుకున్నాయి. పెళ్లి నీళ్లు పడ్డాయని నెటిజన్లు (Netizens) కామెంట్ చేస్తున్నారు. ఒకే ఒక జీవితం సినిమా తర్వాత శర్వా ఎక్కువగా బయట కనిపించలేదు. చాలా రోజుల తర్వాత బయట కనిపించడంతో శర్వా లుక్స్ మారిపోయాయి. అప్పుడు బొద్దుగా ఉండేవాడు. ఇప్పుడు చూస్తే సన్నబడ్డాడు. మరింత అందంగా మారాడు. గడ్డం తీసేసి కనిపించాడు. పెళ్లి కోసం శర్వా నయా లుక్ కనిపించాడు. కాగా, శర్వా పెళ్లికి రామ్ చరణ్ (Ram Charan), రానా (Rana), ప్రభాస్, విజయ్ దేవరకొండ తదితర అగ్ర హీరోలు వెళ్లనున్నారు. అక్కడ పెళ్లి అనంతరం సినీ, రాజకీయ, మిగతా బంధుమిత్రుల కోసం హైదరాబాద్ (Hyderabad)లో వివాహ విందు (Reception) నిర్వహించనున్నారని సమాచారం.