ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే చర్చ జరుగుతోంది. ఆదిపురుష్ గ్రాఫిక్స్ అస్సలు బాగా లేదని.. మీడియం రేంజ్ సినిమాల్లోనే బాగున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో అజయ్ దేవగణ్‌తో ‘తానాజీ’ సినిమాను తెరకెక్కించాడు ఓం రౌత్. ఈ క్రమంలో అజయ్ దేవగణ్ విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ సంస్థ NY VFXWaala.. ‘ఆదిపురుష్’ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ చేసిందనే ప్రచారం జరిగింది. దాంతో రంగంలోకి దిగిన ఆ సంస్థ అధినేతలు.. తాము ఈ సినిమాకు పనిచేయలేదని ప్రకటిస్తూ.. ఒక మీడియా ప్రకటనను కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే.. అసలు ప్రభాస్‌కు ఏమైందనే విషయం.. ప్రభాస్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతోంది.
అయోధ్యలో జరిగిన ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్లో.. ప్రభాస్ కాస్త ఇబ్బంది పడుతున్నట్టు కనిపించాడు. ఎంతలా అంటే మెట్లు దిగడానికి కూడా ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ హెల్ప్ తీసుకున్నట్టు.. కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. దాంతో ప్రభాస్ ఇంకా మోకాలి నొప్పితో బాద పడుతున్నాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సలార్ షూటింగ్లో ప్రభాస్‌కు కాలికి గాయమైందని.. విదేశాల్లో సర్జరీ చేయించుకున్నాడని వార్తలొచ్చాయి. అయితే ఆ తర్వాత పెద్ద రెస్ట్ తీసుకోలేకపోవడంతో.. ఆ నొప్పి ఇంకా బాదిస్తునే ఉందని అంటున్నారు. అయినా సలార్, ప్రాజెక్ట్ కె షూటింగ్‌లతో పాటు ఈవెంట్లకు కూడా అటెండ్ అవుతున్నాడు డార్లింగ్. దాంతో ఇప్పటికైనా ప్రభాస్ కాస్త రెస్ట్ తీసుకోని.. కోలుకున్నా తర్వాత షూటింగ్‌లు చేయాలని కోరుకుంటున్నారు అభిమానులు.