ఆదిపురుష్ సినిమా పోస్ట్ పోన్ అవుతునే ఉంది.. గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. తాజాగా సంక్రాంతి రేసు నుంచి తప్పకుంది ఆదిపురుష్ సినిమా. దాంతో సక్రాంతికి డేట్ లాక్ చేసుకున్న సినిమాలకు లైన్ క్లియర్ అయిపోయింది. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య,’ నందమూరి బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ సినిమాతో పాటు..
విజయ్ ‘వారసుడు’ సంక్రాంతికి రాబోతున్నాయి. అలాగే అఖిల్ ‘ఏజెంట్’ కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఒకవేళ ఆదిపురుష్ సంక్రాంతి బరిలో ఉంటే.. ఈ సినిమాలకు టఫ్ ఫైట్ ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆదిపురుష్ ఆరు నెలలు వెనక్కి వెళ్లింది. ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 16న విడుదల చేయబోతున్నామని ప్రకటించారు మేకర్స్. దీంతో ప్రభాస్ అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో.. ఆదిపురుష్ గ్రాఫిక్స్ అండ్ రీషూట్ గురించి చర్చ జరుగుతోంది. టీజర్ దెబ్బకు గ్రాఫిక్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు దర్శకుడు ఓం రౌత్. అలాగే కొన్ని సీన్స్ రీ షూట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే చాలా సమయం తీసుకుబోతున్నాడని చెప్పొచ్చు. అయితే సమయంతో పాటే అదనపు బడ్జెట్ కూడా ఆదిపురుష్ పై పడబోతోంది.
గ్రాఫిక్స్‌తో పాటు రీ షూట్ కోసం అదనంగా మరో 100 నుంచి 150 కోట్లు కేటాయించినట్లు తెలిసింది. దాంతో ముందుగా అనుకున్న 400 కోట్లు కాస్త 500 కోట్లు దాటడం ఖాయమంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. మరి అంచనాలను అందుకునేందుకు భారీ బడ్జెట్ ఖర్చు చేయిస్తున్న ఆదిపురుష్.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.