Neelu Kohli Husband Death: బాలీవుడ్ నటి ఇంట తీవ్ర విషాదం
నీలు కోహ్లీ(Neelu Kohli) భర్తకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఆయన ఇలా హఠాత్తుగా ఎలా మరణించాడో అర్థం కావడం లేదని సన్నిహితులు తెలుపుతున్నారు. ఇకపోతే నటి నీలు కోహ్లీ నెల రోజుల కిందటే హర్మిందర్ సింగ్(Harmindar singh) పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసింది.
ఈ మధ్య సినీ తారల కుటుంబాల్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బాలీవుడ్(Bollywood) నటి నీలు కోహ్లీ(Neelu Kohli) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నీలు కోహ్లీ భర్త హర్మిందర్ సింగ్(Harmindar Singh) కన్నుమూశారు. బాత్రూంలో ఆయన జారి పడిపోవడంతో చనిపోయినట్లు సమాచారం. హర్మిందర్ సింగ్ కోహ్లీ శుక్రవారం మధ్యాహ్నం గురుద్వారా వెళ్లి ఇంటికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత బాత్రూమ్ కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది.
నీలు కోహ్లీ(Neelu Kohli) భర్తకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఆయన ఇలా హఠాత్తుగా ఎలా మరణించాడో అర్థం కావడం లేదని సన్నిహితులు తెలుపుతున్నారు. ఇకపోతే నటి నీలు కోహ్లీ నెల రోజుల కిందటే హర్మిందర్ సింగ్(Harmindar singh) పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసింది.
పుట్టిన రోజు సెలబ్రేట్ చేసిన కొన్ని రోజులకే ఇలా జరగడంతో నీలు కోహ్లీ(Neelu Kohli) కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. 1999లో వచ్చిన బాలీవుడ్(Bollywood) సినిమా ‘దిల్ క్యా కరే’తో నీలు కోహ్లీ తన సినీ కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె బాస్, గుడ్ బై, జోగి, హౌస్ ఫుల్2 వంటి సూపర్ హిట్ సినిమా(Super hit Movies)ల్లో నటించారు. అదేవిధంగా చోటీ సర్దార్నీ, మధుబాలా వంటి సీరియల్స్ లో నటించి ఆడియన్స్ వద్ద మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.