టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించడానికి తిప్పలు పడుతోంది డింపుల్ హయతి. ఈ బ్యూటీ ఖిలాడీ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో సగ భాగం హోమ్లీగా కనిపించి మురిపించింది. ఆ తర్వాత.. హాట్ గా కనిపించి మైమరిపిస్తోంది. రెండు విధాలుగానూ నటనలో మాత్రం కుమ్మేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ గోపీచంద్ హీరోగా నటించిన రామబాణం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. తాజాగా రామబాణం చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఈ సమావేశంలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై డింపుల్ హయాతి ఒకింత అసహనం వ్యక్తం చేసింది. మీడియా సమావేశంలో ఒక్కొక్కరుగా మీడియా ప్రతినిధులు చిత్ర బృందాన్ని ప్రశ్నలు అడిగారు.
ఈ నేపథ్యంలోనే ఓ రిపోర్టర్ మాట్లాడుతూ…. ఈ మధ్య డైరెక్టర్ లు చాలామంది హీరోయిన్ ల క్యారెక్టర్ లను డిఫరెంట్ గా క్రియేట్ చేస్తున్నారు. కొత్త జోనర్ లు చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం వల్గర్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం రొమాంటిక్ గా అనిపిస్తుంది. ఫ్యామిలీ సీన్స్ ఉన్నా కానీ క్యారెక్టర్ డిజైన్ ఎలా ఉంటుంది అని హీరోయిన్ ను ప్రశ్నించారు. దాంతో డింపుల్ హయాతి అసహనం వ్యక్తం చేసింది. వల్గర్ అనే పదం వినగానే హయాతి ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. వల్గర్ అంటారేంటి నాకు తెలిసి సినిమాలో ఎక్కడా వల్గర్ సీన్ లు చూడలేదు గ్లింప్స్ లో కూడా అలాంటివి కనిపించలేదు అనుకుంటున్నాను. మా సినిమా పాటల్లో పోస్టర్ లలో నేను శుభ్రంగానే ఉన్నాను. మీరు వల్గర్ అంటే నిజానికి నాకు అర్థం కావడం లేదు అంటూ చెంప మీద కొట్టినట్లు సమాధానం ఇచ్చింది. దీంతో బలే రిప్లే ఇచ్చావంటూ ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.