Surya: అమెరికాలో జరిగిన కాల్పుల్లో చనిపోయిన తెలుగుమ్మాయి తాటికొండ ఐశ్వర్య తమిళ నటుడు సూర్య (Surya) అభిమాని అట. విషయం తెలుసుకున్న సూర్య భావోద్వేగానికి గురయ్యారు. ఐశ్వర్య (aishwarya) చిత్రపటానికి నివాళి అర్పించారు. ఆమె కుటుంబానికి సానుభూతి తెలుపుతూ లేఖ రాశారు.
‘ఐశ్వర్య (aishwarya) మృతి తీరని లోటు. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. ఐశ్వర్య మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉంటారు. ఇవి నీ మృతికి నివాళిగా రాస్తున్న అక్షరాలు కావు. నువ్వు నిజమైన హీరోవి. నీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ధృవతారవు, నువ్వు చిందించే చిరునవ్వు, నీలో ఉన్న ప్రేమను పంచే వ్యక్తిత్వం ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుంది’ అని సూర్య (Surya) పేర్కొన్నారు. ఆమె తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు.
టెక్సాస్‌లోని మాల్లో దుండగులు ఈ నెల 6వ తేదీన కాల్పులు జరిపారు. ఐశ్వర్య సహా ఏడుగురు చనిపోయారు. అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువే.. మాల్స్‌లో తుపాకీలు విక్రయిస్తారు. అవీ మిగతా దేశాల పాలిట శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇండియన్స్ లక్ష్యంగా తెల్లవారు ఫైరింగ్ చేస్తున్నారు. అక్కడ ఉరిశిక్ష అమల్లో లేదు. కొన్నేళ్ల జైలు జీవితం తర్వాత.. తిరిగి బయటకొస్తున్నారు. తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ.. కాల్పులకు దిగుతున్నారు. ఇతర దేశాలకు చెందిన వారిపై కోపంతో విచక్షణ మరిచి ఫైర్ చేస్తున్నారు.