ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో కలెక్షన్స్ విషయంలో తగ్గేదే లే అంటుంది. అక్కడ మూడు రోజుల్లో $8 మిలియన్ల మార్క్‌ను దాటేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ సరికొత్త పోస్టర్ షేర్ చేశారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించగా.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.