‘స్త్రీ 2’ కోసం నటి శ్రద్ధా కపూర్‌ను ఎంపిక చేసింది తాను కాదని దర్శకుడు అమర్ కౌశిక్ చెప్పాడు. నిర్మాత దినేష్ విజయ్ తనని ఎంపిక చేశాడని, ఆమెను ఎంపిక చేయడానికి కారణం కూడా ఆయన తనతో చెప్పాడని తెలిపాడు. ‘శ్రద్ధ అచ్చం దెయ్యంలా నవ్వుతుందని, ఈ పాత్రకు తను అయితే పూర్తి న్యాయం చేయగలదని దినేష్ నాతో చెప్పాడు’ అని కౌశిక్ పేర్కొన్నాడు. దీంతో నెటిజన్లు నిర్మాతపై ఫైరవుతున్నారు.