పోలీసులు పంపిన నోటీసుల మేరకు మంచు మనోజ్ రాచకొండ సీపీ కార్యాలయంలో హాజరయ్యారు. దాడి ఘటనలో పోలీసులకు మనోజ్ వివరణ ఇచ్చారు. విచారణకు హాజరుకాని మోహన్ బాబు, విష్ణుకు పోలీసులు మరోసారి సమన్లు జారీ చేశారు. రెండోసారి కూడా విచారణకు హాజరుకాకపోతే.. మేజిస్ట్రేట్ హాదాలో అరెస్ట్ చేసి రిమాండ్ చేసే అవకాశమున్నట్లు తెలిపారు. కాగా.. పోలీసుల నోటీసులను కోర్టులో సవాల్ చేసిన మోహన్ బాబు విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదని విష్ణు పేర్కొన్నారు.