బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, జూ. ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ ‘వార్ 2’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో ఆయన గెస్ట్ రోల్లో కనిపిస్తారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ‘వార్ 2’కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.