తమిళ హీరో సూర్య, మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్య మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. 2D ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ మూవీని నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో సెట్స్ మీదకు వెళ్లనుందట.