NZB: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా డొంకేశ్వర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్ CEC, HEC గ్రూపుల్లో అడ్మిషన్స్ జరుగుతున్నాయని ZPHS పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ తెలిపారు. అడ్మిషన్ కొరకు ఆగస్టు 21 వరకు ఉన్న తేదీని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 31 వరకు గడువు పెంచిందని చెప్పారు. మరిన్ని వివరాలకు ZPHS డొంకేశ్వర్లో సంప్రదించాలని కోరారు.