ATP: కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి స్పీడ్ స్కేటింగ్ పోటీలలో తాడిపత్రి చిన్నారులు రాణించారు. 8 ఏళ్ల బిల్విక రెడ్డి రెండు సిల్వర్ మెడల్స్ సాధించగా, 10ఏళ్ల ముక్తేశ్వరి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకుంది. బిల్విక రింక్–4, రింక్–5 విభాగాల్లో సత్తా చాటగా.. ముక్తేశ్వరి క్యాడేట్ రోడ్ విభాగం, రింక్–5, రింక్–6లో ప్రతిభ కనబరిచింది.