సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఒకే ఇన్నింగ్స్లో 3 సెంచరీలు సాధించి ఆస్ట్రేలియా అరుదైన రికార్డును నమోదు చేసింది. గతంలో కేవలం 4 సార్లు మాత్రమే ఈ రికార్డు నమోదైంది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా జట్టు (WI, IND, SLపై) మూడుసార్లు ఈ రికార్డును నెలకొల్పి అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ (vs నెదర్లాండ్స్) ఒకసారి సాధించింది.