NLG: BRS పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని జిల్లా పార్టీ అధ్యక్షుడు,దేవరకొండ మాజీ MLA రవీంద్ర కుమార్ హెచ్చరించారు. ఆదివారం డిండి మండలం ఎర్రగుంటపాలెంకు చెందిన BRS పార్టీ నాయకుడు కడారి పెద్దయ్యపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేసారు. విషయం తెలుసుకున్న మాజీ MLA అక్కడికి చేరుకొని బాధితుడిని పరామర్శించారు. దాడి చేసిన వారిని శిక్షించాలన్నారు.