JN: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ తదితర కోర్సులు చదువుతున్న అర్హత గల విద్యార్థులు పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని DBCDO రవీందర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత గల విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.