MBNR: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో ఫీజు దీక్ష పేరుతో నిరసనకు దిగిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘానికి బీసీ మేధావుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎన్.ప్రభాకర్ ఆదివారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్‌షిప్స్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.