దృశ్యం సినిమా గురించి మలయాళి స్టార్ హీరో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆ సినిమా కథ నా కంటే ముందు వేరే హీరోలకు చెప్పారు కానీ వాళ్లు ఎవరూ అంగీకరించలేదన్నాడు. చివరకు ఆ కథ నేను విన్నా. నాకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పానని పేర్కొన్నాడు. ఈ సినిమాకు ఎన్నో రీమేక్స్ వచ్చాయి. వాటిని పూర్తిగా చూడలేదన్నాడు. దృశ్యం 3 త్వరలోనే పట్టాలెక్కనుందని వెల్లడించాడు.