VSP: కబడ్డీ క్రీడాకారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘అర్జున్ చక్రవర్తి’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశాఖలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర బృందం పాల్గొంది. హీరో విజయ రామరాజు మాట్లాడుతూ.. ఇది ఒక కబడ్డీ ఛాంపియన్ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రమని తెలిపారు.