ఆస్తుల కోసం మా నాన్నతో గొడవ పడుతున్నాననేది వాస్తవం కాదని మంచు మనోజ్ అన్నారు. ‘సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నాను. ఆదాయం కోసం ఇంటి వాళ్ల మీద ఆధారపడలేదు. మా నాన్న ఇలా ఉండేవారు కాదు.. ఇవాళ చూస్తున్నది మా నాన్న కాదు’ అంటూ ఆవేదనకు గురయ్యారు. కాగా.. ఇవాళ పోలీసుల విచారణలో భాగంగా సీపీ ముందు హాజరుకానున్న మనోజ్.. మిగతా విషయాలు విచారణ తర్వాత వెల్లడిస్తానని పేర్కొన్నారు.