టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నెక్స్ట్ మూవీ నుంచి తాజా అప్డేట్ వచ్చింది. లైకా ప్రోడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా మేకర్స్ ఓ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా జేసన్ తొలిసారిగా డైరెక్షన్ చేయడం విశేషం. అయితే ఈ చిత్రం తెలుగు, తమిళ్ భాషల్లో మాత్రమే విడుదల కానున్నట్లు తెలిపారు.