డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పనుల్లో దర్శకుడు ప్రశాంత్ వర్మ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా సత్యదేవ్ ‘జీబ్రా’ ప్రీరిలీజ్ ఈవెంట్లో వర్మ ఈ సినిమాపై మాట్లాడాడు. ‘సత్యదేవ్ నాకు కాల్ చేశాడు. నేను మోక్షజ్ఞ మూవీని సాలిడ్‌గా ప్లాన్ చేసే పనిలో బిజీగా ఉన్నానని చెప్పాను. చిరంజీవి అతిథిగా వస్తున్నారని నేను వచ్చాను’ అని తెలిపాడు.