రష్యా అధ్యక్షుడు పుతిన్ను విమర్శించిన అలెక్సీ జిమిన్ అనే చెఫ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సెర్బియాలోని బెల్గ్రేడ్లో ఓ హోటల్ గదిలో జిమిన్ విగత జీవిగా కనిపించాడు. గతంలో ఉక్రెయిన్పై మాస్కో సైనిక చర్యను వ్యతిరేకిస్తూ జిమిన్.. పుతిన్ను విమర్శించాడు. అయితే, తన కొత్త పుస్తకం ప్రచారం కోసం సెర్బియా వెళ్లిన అతడు అక్కడే ప్రాణాలు వదిలాడు. జిమిన్ మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.