2025లో తనను ప్రేమించే భాగస్వామి కావాలని సమంత కోరుకున్నారు. వచ్చే ఏడాదిలో తనకేం కావాలో తెలుపుతూ విష్ లిస్ట్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘ఏడాది మొత్తం చాలా బిజీగా ఉండాలి. నటనను ఇంకా మెరుగుపర్చుకోవాలి. ఆర్థికంగా బలంగా ఉండాలి. మరిన్ని అవకాశాలు సొంతం చేసుకోవాలి. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను పూర్తి చేయాలి. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్‌గా ఉండాలి. పిల్లలు కావాలి’ అంటూ పేర్కొన్నారు.