కుటుంబ ఆస్తుల కోసం తానెప్పుడూ ఆశపడలేదని మంచు మనోజ్ తెలిపారు. మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందిస్తూ.. ‘కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశా. కొంతకాలంగా నా కుటుంబం దూరంగానే ఉంటుంది. విష్ణు అనుచరులే నా ఇంటి సీసీఫుటేజీ మాయం చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి. విద్యాసంస్థల్లోని బాధితులకు నేను అండగా ఉన్నందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.