నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ మరో సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో ఓ మూవీ చేయబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ నిర్మించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.