టాలీవుడ్ హీరో గోపీచంద్.. యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డితో మూవీ చేసేందుకు సిద్ధమయ్యారట. ఈ మేరకు గోపీకి డైరెక్టర్ కథను వినిపించగా.. అది ఆయనకు నచ్చి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారట. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి గతంలో ‘ఘాజీ’, ‘అంతరిక్షం’ వంటి సినిమాలను తెరకెక్కించారు.