మోహన్ బాబు, మనోజ్ వివాదంపై మంచు విష్ణు స్పందించారు. ‘మమ్మల్ని ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు. మేము కలిసి ఉంటాం అనుకున్నా.. కానీ పరిస్తితులు ఇలా మారుతాయనుకోలేదు. గేట్లు పగులగొట్టి మనోజ్ ఇంట్లోకి వచ్చాడు. నిన్న జరిగిన దాడిలో నాన్నకు గాయాలయ్యాయి. గొడవలతో మా అమ్మ ఆసుపత్రి పాలైంది. ఉద్దేశపూర్వకంగా మీడియా ప్రతినిదిపై మా నాన్న దాడి చేయలేదు. తరాలుగా మా నాన్న అంటే ఏంటో అందరికీ తెలుసు’ అని అన్నారు.