2018లో కేరళను వరదలు ముంచెత్తాయి. ఆ ఘటనలో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. ఈ ఘటనల ఆధారంగా 2018 మూవీ తెరకెక్కింది.
కేరళలో అద్భుత విజయం అందుకున్న చిత్రం 2018 (2018 Movie). జూడ్ ఆంథనీ జోసెఫ్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. టోవినో థామస్, అపర్ణ బాలమురళీ, తన్వి రామ్ కీలక పాత్రల్లో నటించారు. రూ.15 కోట్లతో రూపొందిన ఈ మూవీ కేవలం 10 రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. మలయాళీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీని తెలుగులో విడుదల చేయనున్నారు.
‘2018’ మూవీ ట్రైలర్:
తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ 2018 సినిమా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Trailer Release) చేసింది. 2018లో కేరళను వరదలు ముంచెత్తాయి. ఆ ఘటనలో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు.
వరదల వల్ల పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిళ్లింది. ఆ విపత్తును 2018 అనే టైటిల్ తో సినిమా(2018 Movie)ను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల ట్రైలర్ ను రిలీజ్(Trailer Release) చేశారు. వరదల సమయంలో తమని తాము రక్షించుకుంటూనే ఎదుటివారికి ఎలా సాయం చేశారనే దానిపై కథ నడుస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్(Trailer) అందర్నీ ఆకట్టుకుంటోంది.