ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ కొంతకాలం సంగీతానికి దూరంగా ఉండబోతున్నట్లు, ఆయన మ్యూజిక్‌ను మిస్ అవ్వాల్సిందేనా? అంటూ వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించిన ఆయన కుమార్తె ఖతీజా.. ఆ వార్తలను ఖండించింది. దయచేసి అసత్య ప్రచారాన్ని ఆపండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అంటూ ఇలా రాయడం కరెక్ట్ కాదని పేర్కొంది.