టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఖరారైంది. ‘ఫంకీ’ అనే టైటిల్ పెట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.