చైతూ, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో సినీ ప్రముఖులతో పాటు ఆమె అభిమానులు, నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు. విడాకులు తీసుకుని విడిగా ఉంటున్న వాళ్లని మళ్లీ ఎందుకు వివాదాల్లోకి లాగుతున్నారంటూ పోస్టులు పెడుతున్నారు. సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్న సామ్ ఎక్కడ కనిపించిన ట్రోల్ చేస్తూనే ఉంటారని, ఏం పాపం చేసిందని ఆమెను మానసికంగా విసిగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.