సోషల్ మీడియాలో తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారు వెంటనే సారీ చెప్పాలని నటి సిమ్రాన్ అన్నారు. ‘నాపై తరచూ వార్తలు వస్తున్నా.. నేను సైలెంట్‌గానే ఉన్నాను. నాకు ఆత్మగౌరవం ఉంది. అందుకే ఇప్పుడు వాటికి చెక్ పెడుతున్నా. పెద్ద హీరోలతో కలిసి పనిచేయాలనే ఆలోచన నాకు లేదు. వారితో ఇప్పటికే చాలా మూవీలు చేశాను. ప్రస్తుతం నా లక్ష్యాలు భిన్నంగా ఉన్నాయి. ఇకనైనా నాపై తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ఆపేయండి’ అని తెలిపారు.