ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పాటలు, డైలాగ్స్, బన్నీ పర్ఫార్మెన్స్, శ్రీవల్లి డీ గ్లామర్.. ఇలా అన్ని రకాలుగా దుమ్ముదులిపింది పుష్ప. ఇక ఈ సినిమాతో రష్మిక ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీవల్లిగా డీ గ్లామర్ రోల్లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. తన డ్యాన్స్‌తో ఉర్రుతులూగించింది. ముఖ్యంగా సామీ, సామీ పాటలో రష్మిక చేసిన స్టెప్పులు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉన్నాయి. అప్పట్లో పుష్ప ప్రమోషన్లో భాగంగా ఎక్కడికెళ్లినా సామీ, సామీ స్టెప్పులేసి అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. అలాంటి రష్మికకే దిమ్మ తిరిగిపోయేలా చేసింది ఓ చిన్నారి.
ఓ స్కూల్లో సామీ సామీ హందీ వెర్షన్ పాటకు ఓ చిన్నారి వేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఆ వీడియోలో చిన్నారి స్టెప్పుల్లో క్యూట్‌నెస్ ఓవర్ లోడ్ అయింది. బొద్దుగా ఉన్న ఆ పాప స్టెప్పులకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. దాంతో ఈ వీడియో అలా తిరిగి తిరిగి రష్మిక కంట్లో పడింది. ఇక ఈ వీడియోను చూసిన రష్మిక రీట్వీట్ చేసి ‘ఈ చిన్నారి డాన్స్ చూసి నాకు పిచ్చెక్కిపోతుందని’ పోస్ట్ చేసింది. ‘మేడ్ మై డే.. ఈ క్యూటీని కలవాలనుకుంటున్నా.. ఎలా..? అని ట్వీట్ చేసింది. దాంతో ఆ డ్యాన్స్ వీడియోతో పాటు రష్మిక ట్వీట్ నెట్టింట మరింత వైరల్‌గా మారింది. మరి రష్మిక ఆ చిన్నారిని ఎప్పుడు కలుసుకుంటుందో చూడాలి. ఏదేమైనా పుష్ప ఇంపాక్ట్ ఎలా ఉందో చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం అని చెప్పాలి.