మెగాస్టార్ చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడుతున్నట్లు సమాచారం. గత 25 రోజులుగా ఇందుకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనారోగ్యం గురించి కోలుకుంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా గిన్నిస్ బుక్ రికార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిరు బయటకు వచ్చారట. అయితే కొంత అసౌకర్యంగా ఉండటంతో ఆయనకు సాయంగా సాయి తేజ్ ఈ కార్యక్రమానికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ చిరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.