తెలుగు బిగ్ బాస్-8లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నటుడు అభయ్ ప్రవర్తనపై హోస్ట్ నాగార్జున మండిపడ్డారు. హౌజ్‌లో వ్యవహరించిన తీరును తప్పుబడుతూ రెడ్ కార్డ్ ఇచ్చి, హౌజ్‌ను విడిచి వెళ్లాలని హుకుం జారీ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. అయితే అభయ్ ఒక్క అవకాశం ఇవ్వాలని నాగ్‌ను కోరారు. దీంతో నాగార్జున తన నిర్ణయాన్ని మార్చుకుంటారా లేదా అనేది కాసేపట్లో తేలనుంది.