నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి 2’ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి రానుంది. జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘ప్రతినిధి’ మూవీకి సీక్వెల్గా తెరకెక్కింది. ప్రస్తుత రాజకీయాలను ప్రశ్నించే జర్నలిస్టుగా రోహిత్ ఇందులో నటించారు. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈనెల 27న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా సంస్థ ప్రకటించింది.