పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా న్యూ లుక్‌లో దర్శనమిచ్చాడు. గడ్డం తీసేసి.. క్లీన్ షేవ్‌లో ముఖానికి మాస్క్ పెట్టుకుని ఓ ఎయిర్‌పోర్టులో కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దర్శకుడు హను రాఘవపూడితో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఆయన ఇలా రెడీ అయినట్లు తెలుస్తోంది.