ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి రెండో ట్రైలర్ విడుదలైంది. ‘భయం పోవాలంటే దేవుడి కథ వినాలి, భయమంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాల’ అంటూ చెప్పే కొన్ని డైలాగ్స్ హైలెట్గా నిలిచాయి. ప్రస్తుతం ఇది ఆకట్టుకుంటోంది. కొరటాల శివ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.