‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దయ్యింది. పరిమితికి మించి అభిమానులు రావడంతో వేదిక ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు నిలువరించినా ఫలితం లేకపోయింది. దీంతో నిర్వాహకులు ఈవెంట్‌ను రద్దు చేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత HYDలోని నోవాటెల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. అయితే పాసులు ఉన్నవారు, లేనివారు కూడా నోవాటెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో ఈవెంట్ జరపడం కష్టమంటూ నోవాటెల్ యాజమాన్యం చేతులెత్తేసింది.