‘దేవర’ మూవీకి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు తొమ్మిది రోజుల పాటు రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.25, మల్టీఫ్లెక్సుల్లో రూ.50 పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఇక సినిమా విడుదలయ్యే సెప్టెంబర్ 27న మొత్తం ఆరు షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్‌పై రూ.100 పెంచుకునేందుకు వెసులుబాటు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.